ఆల్చిప్పల్లాంటి కళ్లు, చక్కని శరీరాకృతి, చెరగని చిరునవ్వు... కాజల్ ప్లస్ పాయింట్స్. ఇక అభినయంపరంగా చెప్పాలంటే తొలి చిత్రం ‘లక్ష్మీ కళ్యాణం’ నుంచి ఇటీవల విడుదలైన ‘బృందావనం’ వరకు నటిగా తనను నిరూపించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారామె. కాజల్ కథానాయికగా రంగప్రవేశం చేసి దాదాపు ఆరేళ్లవుతోంది. ఈ ఆరేళ్లల్లో ఎలాంటి వివాదాల్లో ఇరుక్కోకుండా వదంతుల్లో చిక్కుకోకుండా ‘క్లీన్ చిట్’తో సాగుతున్నారు ఈ బ్యూటీ. ఓ నటిగా మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? అనే ప్రశ్నను కాజల్ ముందుంచితే -‘‘పాస్ మార్కులు వేసుకుంటానంతే. తీరిక చిక్కినప్పుడు నా గత సినిమాలను చూస్తుంటాను.
ఓ ప్రేక్షకురాలిగా కాకుండా విమర్శకురాలిగా మారిపోయి ఆ సినిమాలు చూస్తాను. ఎన్నో లోపాలు కనిపిస్తాయి. ‘ఇలా యాక్ట్ చేశామేంటా?’ అని కూడా అనుకుంటాను. అది సహజం. మనం చిన్నప్పుడు దిగిన ఫొటోలను.. ముఖ్యంగా టీనేజ్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు తీయించుకున్న ఫొటోలను చూసుకుని ‘ఛ.. ఇలా ఉన్నామేంటా?’ అని అనుకుంటుంటాం.
అందరూ కాకపోయినా కొంతమంది మాత్రం ఇలానే అనుకుంటారు. సినిమాలు కూడా అంతే. ఆ సమయానికి బాగా చేసినట్లనిపించినా.. ఆ తర్వాత ఎప్పుడైనా అదే సినిమా చూసినప్పుడు.. బాగా యాక్ట్ చేయలేదనిపిస్తుంది. రోజు రోజుకీ పరిణతి పెరుగుతోంది కాబట్టే అలా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే.. మొదటి సినిమా అప్పుడు ఒక సీన్ చెయ్యగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ‘మానిటర్’లో చూసుకునేదాన్ని. రాను రాను అలా చేయడంలేదు.
ఇప్పుడైతే మానిటర్ చెక్ చేసుకోవడంలేదు. బాగా యాక్ట్ చేసి ఉంటాననే నమ్మకం కలగడంవల్ల మానిట్‌ర్ వైపు లుక్కేయడంలేదు. సినిమా సినిమాకీ నటిగా నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఎంత క్లిష్టమైన

0 comments:
Post a Comment